Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాలనుకున్న టాలీవుడ్ బిజీ భామ!

చిన్నప్పుడు తన పెళ్లి గురించి తనకు ఎన్నో కలలు ఉండేవని టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా తెలిపింది. 22 లేదా 23 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టగానే పెళ్లి చేసుకోవాలని అనుకునేదాన్నని చెప్పింది. ఇప్పుడు ఆ విషయం తలుచుకుంటేనే నవ్వు వస్తోందని అంది. తనకే కాదు ఈ విషయం వింటే మీకు కూడా నవ్వు వస్తుంది కదూ? అంటూ చమత్కరించింది. ఇప్పుడు తన ధ్యాస అంతా కెరీర్ పైనే ఉందని... ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని చెప్పింది.

More Telugu News